నడిచి నడిచి బొబ్బలెక్కిన రోజా పాదాలు... చిత్రాలివి!

  • గాలేరు - నగరి కోసం రోజా పాదయాత్ర
  • మూడు రోజులుగా నడుస్తున్న మహిళా నేత
  • బొబ్బలెక్కిన పాదాలకు ఆసుపత్రిలో చికిత్స
గాలేరు - నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే, మహిళా నేత రోజా పాదాలకు బొబ్బలెక్కాయి. గత మూడు రోజులుగా ఆమె నడుస్తున్న సంగతి తెలిసిందే. బొబ్బలెక్కిన తన పాదాలకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచారు. రోజా పెట్టిన ఈ పోస్టు వైరల్ కాగా, పలువురు ఆమెకు సంఘీభావం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజల కోసం నడుస్తున్నారు కాబట్టి భగవంతుడు అండగా ఉంటాడని, యాత్ర కొనసాగించాలని సూచిస్తున్నారు. రోజా పెట్టిన ఫోటోలను మీరు కూడా చూడవచ్చు.
Go Back to Shorts
Roja
Padayatra
Galeru-Nagari

More Telugu News